Tuesday, 11 August 2015

హనుమంతుడి సందేశం ?

హనుమంతుడి సందేశం ?
హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.
హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు..? ప్రత్యేకత ఏమిటి...?

హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు..? ప్రత్యేకత ఏమిటి...?
.

హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పార్వతీ దేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు. హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశి స్థానం నుదిటిపైన ఉంటుంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అంగారకుడి రంగు ఎరుపు. అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.

పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం' పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో, అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.

ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో‘మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా...తరువాత రావచ్చు' అనెను. రాములవారు కూడా ‘సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు రావద్దు..'అనెను. అంతట ఆంజనేయుడు ‘రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా...మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామ''అనగా, రాములవారు హనుమంతునితో‘నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని' అని తెలిపాడు.

హనుమంతుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! మీ నుదుట తిలకముంది కదా!పాపిటన సింధూరం దేనికి' అని అడిగాడు. అప్పుడు సీతాదేవి‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని' చెబుతుంది.

వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.

హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ‘హనుమా! ఇదేమిటి‘ అని అడగగా, హనుమంతుడు ‘మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ామెకు వశపడితిరి కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా" అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.

హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా ‘ఆంజనేయా! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి'అని వరదానం చేశాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు.

Monday, 10 August 2015

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా మహాత్మ్యం 
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో  జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :-  తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని  ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించినపాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు  వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.
- See more at:http://www.teluguone.com/devotional/content/hanuman-chalisa-mahathmyam-57-13418.html#sthash.fnjjmZog.dpuf

 ఇప్పుడు హనుమాన్ చాలీసా గానం చేద్దాం : 

దోహా

శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చౌపాయి:

జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 |
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా |8 |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా
వికట రూప ధరి లంక జరావా |9 |
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సఁవారే |10 |
లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉరలాయే |11 |
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ |12 |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై |13|
సనకాదిక బ్రహ్మది మునీశా
నారదా శారద సహిత అహీశా |14 |
యమ కుబేరా దిగపాల జహాఁతే
కవి కోవిద కహి సకే కహాఁతే |15 |
తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా |16 |
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17|
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో త్యాహి మధుర ఫల జానూ |18 |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ |19 |
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |20 |
రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |21 |
సబ సుఖులహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూకో డరనా |22 |
ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోఁ లోక హాంకతే కాంపై |23|
భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై |24 |
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా |25 |
సంకట తేఁ హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై |26 |
సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా |27 |
ఔర మనోరధ జో కోయి లావై
తాసు అమిత జీవన ఫల పావై |28 |
చారోఁ యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా |29 |
సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే | 30|
అష్టసిద్ది నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా |31|
రామ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా |32 |
తుమ్హారే భజన రామకోపావై
జన్మ జన్మకే దుఃఖ బిసరావై |33 |
అంతకాల రఘువరపుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ |34 |
ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ |35 |
సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా |36 |
జైజైజై హనుమాన్ గోసాయీఁ
కృపాకరో గురుదేవకీ నాయీ |37 |
యహ శతవార పాఠకర్ కోయీ
ఛూటహిబంది మహా సుఖహోయీ |38 |
జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ది సాఖీ గౌరీసా|39|
తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా|40|

దోహ:

పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము

ఏకబిల్వం శివార్పణం!!!

పరమశివుని పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటుంటాము.
జ్ఞానస్వరూపమయినపరమాత్మయే పరమశివుడు. మనలోని అజ్ఞానాన్ని ( మందబుద్ధిని) రూపుమాపి,
జ్ఞానజ్యోతి’ ని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కల్గించమని, జ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటుంటాము.

పూజకుడు – పూజ్యము – పూజ/స్తోత్రము – స్తుత్యము – స్తుతి /జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము అనే అర్థాలను చెబుతున్నారు. ఇలా (3×3) మూడు x మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుతిజ్ఞానం. ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలలో మూడుపత్రాలుగా వేరు వేరుగా వున్నట్లు గోచరిస్తున్నాడు.
కానీ, ఆయన సర్వాంతర్యామి. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించటం వలన సర్వపాపాలు నశిస్తాయి.
ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించటం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతుంటాయి.అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజకుడవు నీవే, పూజింపబడేది నీవే, పూజాక్రియవు నీవే” అనే భావంతో శివుని పూజించుటయే సరియైన పద్ధతి.
ఈ జ్ఞానరహస్యాన్నితెలుసుకుని – బిల్వపత్రరూపంతో‘త్రిపుటి జ్ఞానాన్ని’ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకుని ‘శివోహం, శివోహం’ అనే మహావాక్యజ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమయిన ఈశ్వరపూజకు ‘బిల్వపత్రం’ సర్వశ్రేష్టమైనది. శివార్చనలకు మూడురేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వపత్రాలు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటాయి. వాదిపోయినప్పటికీ దోషం ఉండదు.ఏకబిలపత్రంలోని మూడురేకులలో ఎడమవైపునది బ్రహ్మఅనీ, కుదివైపుది విష్ణువనీ, మధ్యనున్నది శివుడని చెప్పబడుతోంది.
ఇంకా బిల్వదళములోని ముందుభాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులుండటంచేత,బిల్వపత్రంయొక్కమున్డుభాగాన్ని శివునివైపు ఉంచి పూజించాలి. బిల్వవనం కాశీక్షేత్రంతో సరిసమానమైనది అని శాస్త్రవచనం. మారేడుచెట్టు ఉన్నచోట, ఆ చెట్టు క్రింద ‘లింగాకారం’లో శివుడు వెలసి ఉంటాడుట.
ఇంటి ఆవరణలో ఈశాన్యభాగంలో మారేడుచెట్టు ఉంటే, ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమరవైపున ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణవైపు ఉంటే యమబాధాలు ఉండవు.

Sunday, 2 August 2015

హనుమాన్ చాలీసా మహత్యం